ఏపీకి బిగ్ అలర్ట్.. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు

by srinivas |   ( Updated:2024-09-24 03:25:28.0  )
ఏపీకి బిగ్ అలర్ట్.. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు వాతావరణ శాఖ అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. రానున్న 24 గంటలపాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని స్పష్టం చేశారు. మరో 24 గంటల పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర (North, South Coastal Andhra)కు భారీ వర్ష సూచనలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులోనూ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు గంటకు 35 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్ష పాతం నమోదు అయిందన్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోటలో 10 సెం.మీ వర్షం పడిందని, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 9 సెం.మీ. అల్లూరి జిల్లా వరరామచంద్రాపురంలో 5 సెం.మీ వర్షపాతం నమోదు అయిందని చెప్పారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed