విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by srinivas |
విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా(Visakha District)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాటిచెట్లపాలెం (TatiChetla Palem)లో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి 600 మీటర్ల మేర డామినర్ స్పోర్ట్స్ బైక్ (Sports Byke) దూసుకెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతి చెందిన యువకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed