తిరుమల కల్తీ నెయ్యి ఇష్యూ.. యాదాద్రి ఆలయ అధికారుల కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |
తిరుమల కల్తీ నెయ్యి ఇష్యూ.. యాదాద్రి ఆలయ అధికారుల కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) కల్తీ నెయ్యి వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ అంశంపై పార్టీలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా సీరియస్ అయింది. నెయ్యి సరఫరా చేసిన తమిళనాడు కంపెనీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆలయానికి సరఫరా చేసిన నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫలం కావడంతో షోకాజ్‌ నోటీసులు పంపింది. కల్తీ నెయ్యి వ్యవహారం వేళ తెలంగాణలోని యాదాద్రి ఆలయ(Yadadri temple) అధికారులు అప్రమత్తమయ్యారు. యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌‌లోని ల్యాబ్‌కు పంపించారు. మదర్ డెయిరీ ఈ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. లడ్డూతో పాటు యాదాద్రి ఆలయంలో ఆమ్మే పులిహోరాపైనా అధికారులు ఫోకస్ పెట్టారు. అంతేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల ప్రసాదాల నాణ్యతపై అధికారులు దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.

Next Story