- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్ సహా పలు దేశాల్లో నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్
దిశ, టెక్నాలజీ: సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మెటా ప్లాట్‌ఫామ్‌లు భారత్‌తో పాటు అంతర్జాతీయంగా పలు దేశాల్లో స్తంభించాయి. సాంకేతిక సమస్య కారణంగా మెటాకు చెందిన ఈ సేవలు నిలిచిపోయాయి. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడి తమ అకౌంట్లు అనూహ్యంగా లాగ్-అవుట్ అవడం, తిరిగి లాగ్-ఇన్ అవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌లో కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు చెప్పారు. మెటాకు చెందిన అన్ని యాప్‌లలోని వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయలేకపోతున్నారు. నిత్య జీవితంలో భాగమైపోయిన ఈ ప్లాట్‌ఫామ్‌లు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోవడంతో 2024లో ఇప్పటివరకు సంభవించిన అతిపెద్ద ఇంటర్నెట్ అంతరాయమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.