- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒలంపిక్స్-2036కు భారత్ బిడ్!.. ఐవోసీకి ఐవోఏ లేఖ
దిశ, స్పోర్ట్స్ : 2036లో జరగబోయే ఒలంపిక్స్, పారాలంపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ ప్రయత్నిస్తోంది. ఆ దిశగా భారత్ కీలక అడుగు వేసింది. 2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం అధికారికంగా బిడ్ వేసింది. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ).. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ)కి లేఖ రాసింది. ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. ఒలింపిక్స్, పారాలింపిక్స్ ఆతిథ్యమివ్వడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టు ఐవోఏ గత నెల 1వ తేదీనే ఐవోసీ ఫ్యూచర్ మోస్ట్ కమిషన్‌కు ఐవోఏ లేఖ రాసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘విశ్వక్రీడలునిర్వహించడం వల్ల ఎకనమిక్ గ్రోత్, సోషల్ ప్రొగ్రెస్, యూత్ ఎంపవర్‌మెంట్ వంటి అంశాలు దేశానికి కలిసొస్తాయి’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలు సాధించింది. తర్వాతి విశ్వక్రీడలు 2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరగనున్నాయి. 2032 ఒలింపిక్స్‌కు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ ఆతిథ్యమిస్తున్నది.
పోటీలో 10 దేశాలు
2036 ఒలంపిక్స్ నిర్వహించేందుకు భారత్ సహా 10 దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియాతో పాటు మెక్సికో, ఇండోనేషియా, టర్కీ, పొలాండ్, ఈజిప్ట్, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, ఖతార్ ఆతిథ్య హక్కుల రేసులో ఉన్నాయి. ఆతిథ్య హక్కులు దక్కుతాయని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఐవోసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ సైతం ఒలంపిక్స్ నిర్వహణ అంశంలో భారత్‌కు మద్దతు తెలుపుతున్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఐవోసీ సెషన్‌లో ఆతిథ్య దేశాన్ని ప్రకటించనున్నారు. ముందుగా ఐవోసీ బృందం బిడ్ వేసిన నగరాన్ని అధ్యాయనం చేయనుంది. ఆతిథ్యమివ్వడానికి ఖర్చులు, ప్రజల అభిప్రాయం ఇతర విషయాలను స్టడీ చేస్తుంది. అనంతరం ఐవోసీ సెషన్‌లో ఓటింగ్ ద్వారా ఆతిథ్య దేశాన్ని ఎన్నుకుంటారు.
వేదికగా అహ్మదాబాద్
ఒలింపిక్స్‌కు నిర్వహణకు భారత ప్రభుత్వం అహ్మదాబాద్, ఢిల్లీ నగరాలను పరిశీలించినట్టు తెలిసింది. అయితే, అహ్మదాబాద్ వేదికగా విశ్వక్రీడలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తాజా లేఖలో అహ్మదాబాద్ పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. అహ్మదాబాద్‌లో ఇప్పటికే ఒలింపిక్స్‌కు సంబంధించిన ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆతిథ్య హక్కులు దక్కితే విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చే 4వ ఆసియా దేశంగా భారత్ నిలువనుంది. ఇంతకుముందు చైనా, సౌత్ కొరియా, జపాన్‌లు ఒలంపిక్స్ నిర్వహించాయి.
- Tags
- #2036 Olympics