- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Manipur: 8 అడుగుల రాకెట్లు, పేలుడు పదార్థాలు.. మణిఫూర్‌లో మరోసారి భారీగా ఆయుధాలు స్వాధీనం
దిశ, నేషనల్ బ్యూరో: అల్లర్లతో అట్టుడుకున్న మణిపూర్ (Manipur)లో మరోసారి భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు ఇండియన్ ఆర్మీ(Indian Army), మణిపూర్ పోలీసులు (Manipur Police), సీఆర్‌పీఎఫ్(CRPF) బలగాలు సంయుక్తంగా చురచంద్‌పూర్ (churachandpur) జిల్లాలో మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 7 అంగుళాల పొడవున్న రెండు రాకెట్లు, 8 అంగుళాల పొడవున్న రెండు రాకెట్లు, రెండు పెద్ద మోర్టార్లు, ఒక మధ్య తరహా మోర్టార్, అనేక పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఇండియాలోనే తయారు చేసినవని పోలీసులు తెలిపారు. థాంజింగ్ రిడ్జ్ ప్రాంతంలో ఇవి లభ్యమైనట్టు వెల్లడించారు. దాడులకు పాల్పడే మిలిటెంట్ సంస్థలే వీటిని ఇక్కడ నిల్వచేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అంతకుముందు అక్టోబర్ 31న కూడా భద్రతా దళాలు ఇదే జిల్లాలో నాలుగు రాకెట్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, గతేడాది మే 3 నుంచి మణిపూర్‌లో అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.