- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్రూకాలర్ అవసరం లేకుండా.. ఫోన్ చేసేది ఎవరో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
దిశ,ఫీచర్ : స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిలో ట్రూకాలర్ యాప్ అనేది తప్పనిసరిగా ఉంటుంది.ఏదైనా తెలియని నెంబర్ నుంచి కాల్ లేదా, మెస్సేజ్ వచ్చినా, వెంటనే ట్రూకాలర్‌లో చెక్ చేస్తుంటారు. అంతే కాకుండా కొన్ని స్పామ్ కాల్స్ గురించి మనం లిఫ్ట్ చేయకముందే ఆ కాల్ ఏంటో తెలుసుకుంటున్నాం. దీంతో ఫేక్ కాల్స్ నుంచి యూజర్లకు కాస్త ఉపశమనం దొరికినట్లవుతుంది. అయితే ఈ ట్రూ కాలర్ లేకుండా స్పామ్ కాల్స్, మొబైల్ వినియోగ దారులు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోనే వీలు కల్పించండని ట్రాయ్ టెలికాం ఆపరేటర్లకు ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే.
దీంతో వినియోగదారుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ట్రాయి త్వరలోనే సప్లిమెంటరీ సర్వీస్ గా టెలికాం కంపెనీలు కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ని అందించాలని నిర్ణయం తీసుకుంది. దీని వలన ట్రూకాలర్ వంటి యాప్స్ తో సంబంధం లేకుండానే ఫోన్ చేసేది ఎవరో ఇకపై మొబైల్ స్క్రీన్ పై డిస్ల్పే అవుతుంది. మొబైల్‌లో సేవ్ చేసుకున్న పేర్లే కాకుండా, మన ఫోన్ లో సేవ్ చేయని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఎవరు చేశారో తెలిసిపోనుందంట. ఫోన్ చేసేదెవరో తెలిసిపోయేలా రానున్న ఈ సర్వీసులు భారత్ లో డీఫాల్ట్ గా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.