ఇండియాలో సరికొత్త కొత్త ల్యాప్‌టాప్‌ను తెచ్చిన Dell

by Harish |
ఇండియాలో సరికొత్త కొత్త ల్యాప్‌టాప్‌ను తెచ్చిన Dell
X

దిశ, టెక్నాలజీ: దిగ్గజ కంపెనీ డెల్ ఇండియాలో కొత్త మోడల్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. దీని పేరు ‘Dell Alienware m18 R2’. ఇది గురువారం మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ ల్యాప్‌టాప్ 14th జెన్ Intel Core i7 ప్రాసెసర్‌తో వచ్చింది. ఇది మూడు రకాల CPU ఆప్షన్లలో లభిస్తుంది. మూడు Nvidia GeForce RTX 4090 GPU ఎంపికలను కూడా కలిగి ఉంది. దీని ధర రూ. 2,96,490. డెల్ ఇండియా వెబ్‌సైట్, డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ల్యాప్‌టాప్ 18-అంగుళాల డిస్‌ప్లే పూర్తి-HD+ (1,920 x 1,200 పిక్సెల్‌లు), QHD+ (2,560 x 1,600 పిక్సెల్‌లు) రిజల్యూషన్ ఆప్షన్లలో లభిస్తుంది. రిఫ్రెష్ రేట్‌ 165Hz. Windows 11 ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. 64GB వరకు డ్యూయల్ చానల్ DDR5 RAMతో పాటు, 4TB/8TB వరకు డ్యూయల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీనిలో 97Wh బ్యాటరీని అందించారు. ఇది 360W వరకు చార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. Wi-Fi 7, బ్లూటూత్ 5.4 వరకు కనెక్టివిటీ ఉంది. హీట్ కాకుండా ఉండటానికి Alienware Cryo-Tech కూలింగ్ టెక్నాలజీ ఉంది, ఇంకా AlienFX లైటింగ్, Dolby Vision, Dolby Atmos సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది.

Advertisement

Next Story

Most Viewed