Security Alert: డివైజ్‌ను వెంటనే అప్‌డేట్ చేయండి

by Harish |
Security Alert: డివైజ్‌ను వెంటనే అప్‌డేట్ చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా వాడే ఆపరేటింగ్ సిస్టమ్ గూగుల్ Android OS. దాదాపు వాడుకలో ఉన్న డివై‌జ్‌లు చాలా వరకు ఈ OS ద్వారానే రన్ అవుతున్నాయి. అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఎప్పుడు హ్యాకర్స్ దాడి చేస్తుంటారు. బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి హ్యాకర్స్ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలోAndroid వినియోగదారుల డేటాను తస్కరించడానికి ఒక మాల్వేర్‌ను హ్యాకర్స్ ప్రవేశపెట్టినట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-IN) తెలిపింది.

Google ద్వారా Android మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ దేశంలోని స్మార్ట్‌ఫోన్‌ల పరంగా అత్యంత ప్రజాదరణ పొందిన OS. అయితే వినియోగదారుల పరికరాలకు యాక్సెస్‌ పొందేందుకు, సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి ఏకపక్ష కోడ్‌ను అమలు చేయడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు CERT-IN హెచ్చరించింది. "ఫ్రేమ్‌వర్క్ కాంపోనెంట్‌లు, మీడియా ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్ కాంపోనెంట్‌లు, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లు, యూనిసోక్ కాంపోనెంట్‌లు, క్వాల్‌కామ్ క్లోజ్డ్ సోర్స్‌లో కొన్ని లోపాలను" ఏజెన్సీ గుర్తించింది. దీని వలన సున్నితమైన సమాచారాన్ని దొంగిలించవచ్చని, ఈ సమస్య నుంచి బయటపడటానికి త్వరగా Android OS ను అప్‌డేట్ చేయాలని తెలిపింది. Google బ్రౌజర్‌, సెక్యూరిటీని వెంటనే అప్‌డేట్ చేయడం ద్వారా డేటాను ఇతరులు దొంగలించకుండా కాపాడుకొవచ్చని CERT-In పేర్కొంది.

Advertisement

Next Story