సిబిల్ స్కోర్ లేకున్నా ఎమర్జెన్సీగా లోన్ తీసుకోవచ్చా?

by Jakkula Samataha |
సిబిల్ స్కోర్ లేకున్నా ఎమర్జెన్సీగా లోన్ తీసుకోవచ్చా?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది బ్యాంకులలో లోన్ తీసుకుంటున్నారు. ఏదైనా అత్యవసర సమయంలో లేదా, ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బ్యాంకు నుంచి అప్పు అనేది తీసుకుంటాం. అయితే ఏ లోన్ కావాలన్నా సిబిల్ స్కోర్ అనేది మస్ట్. మన సిబిల్ చూసే బ్యాంకులు లోన్ ఇస్తుంటాయి. ఒక వేళ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తాయి.

అయితే కొంత మందికి అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటి సమయంలో సిబిల్ తక్కువగా ఉన్నా.. ఎమర్జెన్సీ లోన్ తీసుకోవచ్చా? అంటే దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.అయితే సిబిల్ లేకుండా ఏ బ్యాంకులు లోన్ ఇవ్వవు కానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు మాత్రం సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా లోన్ ఇస్తూ ఉంటాయి.కానీ వీటిలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి.

కొంత మంది అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు పర్సనల్ లోన్ తీసుకుంటారు. అయితే ఈ లోన్ ఇచ్చే సమయంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సిబిల్ స్కోర్ అంతగా పట్టించుకోవు. కానీ తప్పని సరిగా, ఆ వ్యక్తి ఏదైనా గుర్తింపు పొందిన కంపెనీలో పనిచేస్తూ ఉండాలి. నెలకు 25000లకు పైగా జీతం వస్తుండాలి.ఇలా ఉంటే సిబిల్ లేకపోయినా లోన్ సౌకర్యాన్ని కల్పిస్తాయి.మన శాలరీ స్లిప్, ఆరు నెలల బ్యాంకు స్టేట్ మెంట్‌తో ఎలాంటి సిబిల్ స్కోర్ లేకుండా ఈజీగా లోన్ పొందవచ్చు.

Advertisement

Next Story