YouTube యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై కచ్చితంగా ఆ ఐదు చూడాల్సిందే..!!

by Satheesh |   ( Updated:2022-09-14 11:23:49.0  )
YouTube యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై కచ్చితంగా ఆ ఐదు చూడాల్సిందే..!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతమున్న స్మార్ట్ ఫోన్‌లలో యూట్యూబ్ లేని ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ వాడే వారు చాలామంది యూట్యూబ్‌లో సినిమాలు, ఇతర ఇంట్రెస్టింగ్ వీడియోలు చూస్తూ టైమ్ పాస్ చేస్తూ ఉంటారు. అయితే ఇంట్రెస్టింగ్‌గా వీడియో చూసే సమయాల్లో మధ్యలో వచ్చే యాడ్‌లతో యూట్యూబ్ యూజర్లు కొన్నిసార్లు అసహనానికి గురవుతారు. అయితే, యూట్యూబ్ అలాంటి వారి కోసం యాడ్ ఫ్రీ ఆప్షన్‌ను తీసుకు వచ్చింది.. కాకపోతే దానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా యూట్యూబ్ ఫ్రీ వెర్షన్ కావాలకుంటే ఖచ్చితంగా వీడియో స్టారింగ్‌లో, మధ్యలో వచ్చే యాడ్‌లను తప్పక చూడాల్సి ఉంటుంది. వాటిని స్కిప్ చేసే అవకాశం కూడా ఉండదు.

అయితే, ప్రస్తుతం యూట్యూబ్ ఫ్రీ వర్షన్‌లో వీడియో ప్రారంభంలో రెండు యాడ్‌లు వస్తాయి.. వాటిని కచ్చితంగా చూసిన తర్వాతే మనకు కావాల్సిన వీడియో వస్తుంది. కాగా, ప్రస్తుతం వచ్చే ఈ రెండు యాడ్‌లు చూడటానికే యూజర్ల చిరాకు పడుతుంటే.. యూట్యూబ్ మరో అడుగు ముందుకు వేసింది. ఇకపై యూజర్ల సహనానికి మరింత పరీక్ష పెట్టేలా వీడియో స్టారింగ్‌లో 5 యాడ్స్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. ఇది ఇప్పుడు ప్రయోగ దశలో ఉందని.. కొన్ని ఫోన్‌లలో ఇప్పటికే 5 యాడ్‌లు వస్తున్నాయని వెల్లడించింది. దీనిపై ఓ యూజర్ ట్విట్టర్‌లో ప్రశ్నించగా.. ఆ 5 యాడ్స్‌ను బంఫర్ యాడ్స్ అంటారని.. ఒక్కొ యాడ్ 6 సెకన్లు ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా దీనిపై తమ ఫీడ్ బ్యాక్ తెలపాలని రిప్లే ఇచ్చింది.

Advertisement

Next Story