- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐఫోన్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వార్నింగ్ నోటిఫికేషన్ పంపిన యాపిల్
దిశ, టెక్నాలజీ: దిగ్గజ కంపెనీ యాపిల్ తన వినియోగదారులకు కీలక అలర్ట్‌లను జారీ చేసింది. కిరాయికి తీసుకున్న స్పైవేర్ ద్వారా యాపిల్ ఫోన్లతో సహా దాని ఇతర ఉత్పత్తులపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎంపిక చేసుకున్న యుజర్లను లక్ష్యంగా చేసుకోడానికి ఈ స్పైవేర్‌ను ఇంజెక్ట్ చేస్తుంటారు. భారత్‌తో పాటు 91 దేశాలకు చెందిన యాపిల్ కస్టమర్లకు కంపెనీ హెచ్చరిక నోటిఫికేషన్‌లు జారీ చేసింది. NSO గ్రూప్ తయారు చేసిన పెగాసస్ వంటి సంస్థలచే నిర్వహించబడే స్పైవేర్‌ను అత్యాధునిక సాంకేతికతతో రూపొందించారు. దీని దాడి వలన యూజర్ల డేటా మొత్తం కూడా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక నోటిఫికేషన్లను పంపించారు. యాపిల్ నుండి ఎంతమందికి బెదిరింపు నోటిఫికేషన్ వచ్చిందనేది మాత్రం ఇంకా తెలియలేదు. అయితే కొన్ని ఫోన్లలో ఈ స్పైవేర్ చేరిందని కంపెనీ అనుమానం వ్యక్తం చేస్తుంది.
గత ఏడాది అక్టోబర్‌లో కూడా ఈ స్పైవేర్‌కు సంబంధించిన దాడులు జరిగాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, టీఎంసీ లీడర్ మహువా మొయిత్రాల ఫోన్లలో పెగాసస్ స్పై వేర్ చేరిందని యాపిల్ హెచ్చరించింది. ఈ ఘటన ఆ సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లేటెస్ట్ సాంకేతికతతో ఉండే స్పైవేర్ దాడులకు మిలియన్ల డాలర్లు ఖర్చవుతాయి, అలాగే దీనిని సమాజంలో పేరు, ప్రఖ్యాతలు, హోదా కలిగిన వారిపై దాడి చేయడానికి ఉపయోగిస్తారు. ఈ దాడి నుంచి రక్షించుకోడానికి యూజర్లు అలర్ట్ ఉండాలని కొత్త యాప్స్, లింక్‌లను డౌన్‌లోడ్ లేదా క్లిక్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని యాపిల్ సూచనలు ఇస్తుంది.