వచ్చే ఏడాది నాటికి AI మనిషి కంటే తెలివిగా ఉంటుంది: మస్క్

by Harish |
వచ్చే ఏడాది నాటికి AI మనిషి కంటే తెలివిగా ఉంటుంది: మస్క్
X

దిశ, టెక్నాలజీ: ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటుంది. AI ఉద్యోగుల స్థానాలను భర్తీ చేస్తుందని అన్ని రంగాలు కూడా ఆటోమెషన్‌కు మారుతాయని, ఇది మానవులను మించిపోతుందని చాలా మంది నిపుణులు గత కొంత కాలంగా పేర్కొంటున్నారు. అయితే తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్క మనిషి కన్నా తెలివైందిగా అవుతుందని అంచనా వేశారు.

AI మానవ స్థాయి మేధస్సును ఎప్పుడు చేరుకుటుందనే పోడ్‌కాస్టర్ జో రోగన్ 'ఫ్యూచరిస్ట్' రే కుర్జ్‌వీల్ మధ్య ఇటీవల జరిగిన చర్చకు సంబంధించిన క్లిప్‌‌‌పై ఎక్స్‌లో మస్క్ స్పందిస్తూ, 2029 నాటికి మానవులందరి కంటే AI తెలివిగా ఉంటుందని అన్నారు. OpenAI లాభాలను ఆర్జించడం కంటే, మానవాళికి మేలు చేయడం తమ సంస్థ లక్ష్యమని చెప్పి, ఆ మాట తప్పారని ఓపెన్‌ఏఐ, ఆ సంస్థ సీఈఓ శామ్‌ అల్ట్‌మెన్‌పై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో భాగంగా OpenAI తమ కంపెనీ తరపున వాదించడానికి అగ్రశ్రేణి న్యాయవాదులను నియమించుకుంది.

Advertisement

Next Story

Most Viewed