శ్రీలంక చేరుకున్న టీమ్ ఇండియా

by Shyam |   ( Updated:2021-06-28 08:51:03.0  )
team-india-1
X

దిశ, స్పోర్ట్స్: భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు సోమవారం శ్రీలంక చేరుకున్నారు. గత రెండు వారాలుగా ముంబైలోని ఒక స్టార్ హోటల్‌లో క్వారంటైన్‌లో గడిపిన భారత జట్టు బీసీసీఐ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక విమానంలో కొలంబో చేరుకున్నారు. అక్కడ కూడా మూడు రోజుల పాటు హోటల్ గదులకే పరిమితం కానున్నారు. ఆ తర్వాత భారత జట్టు ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లు ఆడనున్నది. భారత జట్టు ప్రయాణ ఫొటోలు కెప్టెన్ శిఖర్ ధావన్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. భారత జట్టుకు తొలి సారిగా ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్. దేవ్‌దత్ పడిక్కల్, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియాలు చాలా సంతోషంగా కనిపించారు. మరోవైపు గత కొన్నాళ్లుగా జట్టులో స్థానం కోల్పోయిన కుల్‌దీప్ యాదవ్ ఈ పర్యటనలో సత్తా చాటి టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించాలని భావిస్తున్నాడు. భారత పరిమిత ఓవర్లు జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

team-india-2

టీమ్ ఇండియా : శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీషా, దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, యజువేంద్ర చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.

https://twitter.com/BCCI/status/1409507539218280448?s=20

Advertisement

Next Story