- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిషబ్ పంత్ హార్ట్ ఎటాక్ తెప్పించగలడు : శ్రీధర్
దిశ, వెబ్‌డెస్క్: గబ్బా టెస్టులో ఆస్ట్రేలియాపై విజయం తర్వాత టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్‌పై పలువురు క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసమాన ప్రదర్శనతో జట్టు విజయంలో పంత్ కీలక పాత్ర పోషించాడని కీర్తించారు. సచిన్, సెహ్వాగ్, గంబీర్, గవాస్కర్ వంటి సీనియర్స్ ఇప్పటికే అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్.. 274 పరుగులు చేసి సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడని అన్నారు. వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ఊపు తెచ్చాడని తెలిపారు. రిషబ్ పంత్ హిట్టింగ్ చూస్తే.. గుండెపోటు వస్తుందని ఆర్. శ్రీధర్ సరదాగా అభిప్రాయపడ్డాడు. ‘అంతేగాకుండా రిషబ్ పంత్ గొప్ప ఆటగాడు. ప్రపంచంలో ఉన్న విధ్వంసకర ఆటగాళ్లలో ఒకడు. ఏమాత్రం భయం లేకుండా ఆడగలడు. ఒక్కోసారి అతను మరోలా ఆడి మనకి అప్పుడప్పుడు గుండెపోటు తెప్పిస్తాడు. మరోసారి మనం ఊపిరి పీల్చుకునే ఆనంద క్షణాలు కూడా ఇస్తుంటాడు’ అని టీమిండియా ఫిల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ వెల్లడించారు.