అందుకే ఓడిపోయాం : విరాట్ కోహ్లీ

by Anukaran |
Virat Kohli
X

దిశ, వెబ్‌డెస్క్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లోనే ఛేదించింది. దీంతో టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాము. అనుకున్న షాట్లను సరిగ్గా ఆడలేకపోయాం’ అని అన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో పక్కా ప్లాన్‌తో తిరిగివస్తామని తెలిపాడు. బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కారణంగా ఓటమి చెందాల్సి వచ్చిందన్నాడు. దీంతో ఇంగ్లాండ్‌‌కు విజయం సులువైందని చెప్పాడు. శ్రేయస్‌ అయ్యర్‌ ఒక్కడే మంచి ప్రదర్శన చేసినా.. మిగతా బ్యాట్స్‌మన్లు పూర్తిగా విఫలమయ్యారని కోహ్లి తెలిపాడు.ఆట‌లో గెలుపు, ఓటములు సహజమేనని తర్వాతి మ్యాచ్‌కు సరైన ప్రణాళికతో తిరిగివస్తామన్నాడు.

Advertisement

Next Story