- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చదువుతో పాటు చాకిరి బాధ్యత గురువులదే
దిశ ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను తొలంగించడంతో ఉపాధ్యాయులే పాఠశాలలు శుభ్రపరచుకొంటున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ పనులు చేయాలని ఉత్తర్వులు ఉన్నా, ఏదో ఒక రోజు చేయడం, తర్వాత పట్టించుకోవడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలను చూడలేక టీచర్లే స్వయంగా బాత్‌రూంలు కడుగుతున్నారు. గదుల్లోని బూజును దులుపుతున్నారు.
చదువులు చెప్పాల్సిన గురువులు చివరికి చీపుర్లు పట్టి అన్ని పనులు చేసుకోవాల్సి రావడంపై బాధపడుతున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలను తీర్చిదిద్దడం కోసం చాకిరి చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని బొడ్రాయి తండా ఉన్నత పాఠశాలను అక్కడి ప్రిన్సిపల్ ఇందిరా రాణి, టీచర్లతో కలిసి శుక్రవారం శుభ్రం చేశారు. పాఠశాలకు వచ్చే పిల్లల జాగ్రత్త తమకు ముఖ్యమని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని గురుతర బాధ్యతను వెల్లడించడం విశేషం.