జాతి వివక్షపై పిల్లలకు అవగాహన కల్పించాలి: సంగక్కర

by Shyam |
జాతి వివక్షపై పిల్లలకు అవగాహన కల్పించాలి: సంగక్కర
X

దిశ, స్పోర్ట్స్: ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తర్వాత అన్నిరంగాల్లో జాతి వివక్ష తెరపైకి వచ్చింది. క్రికెట్‌లో జాతి వివక్షను ఎదుర్కొన్నట్లు పలువురు క్రీడాకారులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రైజ్ ద బ్యాట్ సిరీస్‌లో జాతి వివక్షకు వ్యతిరేకంగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ లోగోలను ధరించి ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర కూడా జాతి వివక్షపై గళం విప్పారు. చిన్నతనం నుంచే పిల్లలకు జాతి వివక్షపై అవగాహన పెంచాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం వాస్తవ చరిత్రను పిల్లలు చదివేలా చూడాలని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వడబోసిన చరిత్ర అవసరం లేదన్నాడు. ఎంతో పెద్ద చదువులు చదివిన వాళ్లు కూడా ఘోరంగా ప్రవర్తించడాన్ని తాను చూసినట్లు చెప్పారు. ఇది ఒక్క రోజులో రూపుమాపే సమస్య కాదని, దానికి మరిన్ని రోజులు కష్టపడాలని సంగక్కర అభిప్రాయపడ్డారు. మరోవైపు శ్రీలంక ప్రభుత్వం ఇకపై పుట్టబోయే పిల్లల బర్త్ సర్టిఫికేట్లపై మతం, జాతి వివరాలు నమోదు చేయబోమని ప్రకటించడంపై పలువురు క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story