- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ టీ పొడి ధర తెలిస్తే షాక్!
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఒక కేజీ టీ పొడి ధర ఎంత ఉంటుంది? మహా అయితే, వంద నుంచి 1,000 రూపాయల దాక ఉంటుంది. కానీ, గురువారం గువహటి టీ ఆక్షన్ సెంటర్ (జీటీఏసీ)లో జరిగిన వేలం పాట ఒక కేజీ టీ పొడికి ఏకంగా రూ.75,000 ధర పలికింది. ఈ టీ పొడి పేరు మనోహరి గోల్డ్ టీ. దీన్ని అసోంలోని దిబ్రూగర్ జిల్లాకు చెందిన మనోహరి టీ ఎస్టేట్ వారు ఉత్పత్తి చేస్తున్నారు. మరి ఈ టీ పొడి ఇంత ధర పలికిందంటే ఏదో ప్రత్యేకత ఉండి తీరాలి కదా? అవును..ఈ టీ పొడి తయారీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తేయాకు చెట్టు మీద రెండో విడతగా వచ్చిన చక్కని లేత తేయాకు మొగ్గలను, సాయంత్రం పూట మాత్రమే చేతితో కోసిన తయారు చేసిన టీ పొడి ఇది.
అద్భుతమైన సువాసనతో, పసుపు రంగు తేనీరును ఇస్తుందని మనోహరి టీ ఎస్టేట్ డైరెక్టర్ రంజన్ లోహియా తెలిపారు. కాంటెంపరరీ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్వహించిన వేలంలో ఈ టీ పొడిని గువహటికి చెందిన విష్ణు టీ కంపెనీ దక్కించుకుంది. వారి డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా ఆన్‌లైన్‌లో దేశవిదేశాలకు ఈ టీ పొడిని సరఫరా చేయనున్నారు. కరోనా పాండమిక్ సమయంలో ఇలా ధర పలకడం చాలా ఆనందంగా ఉందని వేలం నిర్వహించిన కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే టీ పొడిని వేలంలో రూ. 50వేలకు అమ్మారు. ఇప్పుడు ఆ రికార్డును ఆశించిన దాని కంటే ఎక్కువ మొత్తంతో బ్రేక్ చేయడం నిజంగా సంతోషంగా ఉందని జీటీఏసీ వెల్లడించింది.