- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపల్ ఎలక్షన్స్‌ను.. ఫ్యాక్షనిస్టు ఎన్నికలుగా మార్చేసిన జగన్: నారా లోకేష్..
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయ్‌ని గొడ్డలి పోటుతో బలిచేసినట్టే..ప్రజాస్వామ్యాన్ని జగన్ రెడ్డి దొంగ ఓట్ల వేటుతో ఖూనీ చేస్తున్నారని ట్విటర్ వేదికగా ఆరోపించారు. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని జగన్‌రెడ్డి నడిబజారులో అంగడి సరుకు చేశారని విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలను నిర్బంధించి, ఏజెంట్లని పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించారు. అంతేకాదు ఇతరప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు పలువురుని వైసీపీ నేతలు తీసుకువచ్చారన్నారు.
వారిని కుప్పం ఎలా రానిచ్చారు అంటూ పోలీసులను లోకేశ్ ప్రశ్నించారు. వైసీపీ వాలంటీర్లే దొంగ ఓటర్లని బూత్‌లకు తీసుకొస్తుంటే, ఎన్నికల సంఘం ఏం చేస్తోందని నిలదీశారు. పోలీసుల ముందే దొంగ ఓటర్లు కాలరెగరేసుకుని వెళ్తూ ఓటేసి వస్తున్నారన్నారు. జగన్ అరాచకపాలన, పెరిగిన ధరలు, పెంచిన పన్నులు, అధ్వాన రోడ్లు, కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్రహంగా ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తే దారుణ ఓటమి తప్పదని తెలుసుకున్న జగన్‌రెడ్డి.. డెమోక్రసీ పద్ధతిలో జరగాల్సిన ఎలక్షన్‌ని ఫ్యాక్షనిస్టు కనుసన్నల్లో జరిగే సెలక్షన్‌గా మార్చేశారు అంటూ లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.