- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నాం: టీడీపీ సీనియర్ నేత నారాయణ
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా చేయడమే కాకుండా, పరిశ్రమలకు, సాధారణ వినియోగానికి సకాలంలో విద్యుత్ అందించారని, విద్యుత్ వ్యవస్థ మెరుగుపడటంతో పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రానికి క్యూకట్టారని కొనియాడారు. ఈ సందర్భంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై నిప్పులు చెరిగారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకు గుర్తుగా గతంలో వల్లభనేని వంశీ భారీ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేశారని..ఆ సమయంలో చంద్రబాబు సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రస్తుతం వైసీపీకి అనుబంధంగా ఉన్న వల్లభనేని వంశీ తన నియోజకవర్గానికి ఏంచేశాడో చెప్పాలని నిలదీశారు. ఎవరి కళ్లల్లోనో ఆనందంచూడటం కోసం, దిగజారి మాట్లాడితే సభ్యసమాజం హర్షించదని వంశీలాంటివారు గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. ముఖ్యమంత్రి కూడా తనస్థాయికి తగినట్లు ప్రవర్తిస్తే మంచిదని సూచించారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ పౌరులుగా తామంతా సిగ్గుపడుతున్నామని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. తెలంగాణ ఎలా సస్టెయిన బుల్ అవుతుందా అని విభజనతర్వాత తామందరం అనుకున్నామని.. కానీ, ఈనాడు తెలంగాణ ముందుకు పోతుంటే ఏపీ వెనకబడటం చూస్తుంటే బాధేస్తోందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి విద్యుత్ లోటు ఏర్పడిందని, దాంతో చాలామంది పారిశ్రామిక వేత్తలు తెలంగాణ బాట పట్టారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల వ్యాఖ్యలే ఏపీ దుస్థితికి నిదర్శనం.. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ చీకట్లో మగ్గుతుంటే, తెలంగాణలో విద్యుత్ పుష్కలంగా ఉందని చెబుతున్నాడు.. తెలంగాణ మంత్రి హరీష్ రావేమో ఆంధ్రాలోని పరిస్థితులు తెలంగాణకు వరంగా మారాయంటున్నారు. పొరుగురాష్ట్ర పాలకుల వ్యాఖ్యలపై ఇక్కడి ముఖ్యమంత్రి జగన్ సిగ్గుపడాలని కొనకళ్ల విమర్శించారు.