టీడీపీ అభివృద్ధిని ప్రజలకు వివరించాలి : బక్కని

by Shyam |
TDP Bakkani Narsimhulu
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధిని, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీతోనే పల్లెలోని ప్రతి గడపకు అధికారులు వచ్చారని తెలిపారు. పాలన అంటే ప్రజలకు తెలిసిందని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. యువతే పార్టీకి కీలకమని వారంతా పార్టీ వైపు మొగ్గుచూపేలా రాష్ట్ర కమిటీ కృషి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతమే మనందరి లక్ష్యమన్నారు.

ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సి రెడ్డి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు కాట్రాగడ్డ ప్రసూన, బండి పుల్లయ్య, వాసిరెడ్డి రామనాధం, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు జక్కలి ఐలయ్య యాదవ్, అజ్మీరా రాజు నాయక్, ఏ.కె.గంగాధర్ రావు,షేక్.ఆరీఫ్,గడ్డి పద్మవాతి, గన్నోజు శ్రీనివాస చారి, జీవీజీ నాయుడు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు మాదాడి శ్రీనివాస్ రెడ్డి, కుమారి జాఠోతు ఇందిరా, రేంజర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed