బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలు కొనసాగించాలి !

by srinivas |
బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలు కొనసాగించాలి !
X

దిశ, శ్రీకాకుళం: రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేసిన బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ కార్యాలయం వద్ద టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు రద్దు చేస్తూ వైసీపీ కాలం గడుపుతోందన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారంలోనూ జగన్‌ సర్కార్ విఫలమైందని విమర్శించారు. గిరిజన విద్యార్థులు, ప్రజల్నిబాధపెట్టకుండా పథకాలు, రాయితీలను ఎప్పటిలాగే అమలు చేయాలని కోరుతూ.. ఐటీడీఏ పీవో శ్రీధర్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.

Advertisement

Next Story