- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుప్పంలో టీడీపీ ఓటమి ఖాయం: బాలినేని శ్రీనివాసరెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: కుప్పం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కుప్పంలో కూడా టీడీపీకి ఓటమి భయంపట్టుకుందన్నారు. లోకేశ్ ఓటుకు రూ.5వేలు పంచుతున్నారని ఆరోపించారు.
సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారని నిలదీశారు. కుప్పంని మున్సిపాలిటీ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని చెప్పుకొచ్చారు. టీడీపీ ఎన్నికుట్రలు చేసినా కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కొనసాగుతుందని..నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.