తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్?

by Shyam |
తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్?
X

దిశ, వెబ్‌డెస్క్:
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కార్ వారి పాట’ గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వస్తోంది. విదేశాల్లో 45 రోజుల షూటింగ్ జరుపుకోనున్న షెడ్యూల్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన తారాగణం అంతా పాల్గొంటారనే టాక్ వినిపించింది. నవంబర్ నుంచి శరవేగంగా షూటింగ్ జరగనుండగా.. జనవరిలో మళ్లీ ఇండియాకు తిరిగి రానుంది మూవీ యూనిట్.

ఇదిలా ఉంటే, సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్, విద్యా బాలన్ నటిస్తున్నారనే న్యూస్ కూడా స్ప్రెడ్ కాగా.. ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో మరో న్యూస్ హల్ చల్ చేస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా రాణించిన తరుణ్.. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న తరుణ్.. కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ‘సర్కార్ వారి పాట’తో రీ ఎంట్రీ ఇస్తున్నాడనే విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. తరుణ్‌కు ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ సక్సెస్‌తో జోష్‌ఫుల్‌గా ఉండాలని కోరుకుంటున్నారు.

పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ‘సర్కార్ వారి పాట’ను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. హీరోయిన్ కీర్తి సురేష్ మహేశ్ బాబుతో రొమాన్స్ చేయనుంది.

Advertisement

Next Story