నిశ్శబ్దం మిమ్మల్ని రక్షించలేదు: తమన్నా

by Shyam |   ( Updated:2020-06-05 07:43:01.0  )
నిశ్శబ్దం మిమ్మల్ని రక్షించలేదు: తమన్నా
X

జార్జ్ ఫ్లాయిడ్ హత్యానంతరం అమెరికాలో ఆందోళనలు చెలరేగాయి. బ్లాక్ లివ్స్ మ్యాటర్ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలోనూ ఉద్యమం ఉధృతం అయింది. ఈ పోరాటానికి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తమ మద్దతు ప్రకటించారు. బ్లాక్ అవుట్ ట్యూజ్‌డే పేరుతో ప్రియాంక చోప్రా, ఉపాసన కొణిదెల, సమంత అక్కినేని లాంటి ప్రముఖులు స్ట్రాంగ్ మెస్సేజ్‌తో కూడిన పోస్ట్‌లు పెట్టారు. కాగా తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రామ్‌లో పవర్ ఫుల్ పోస్ట్ పెట్టింది.

మీ నిశ్శబ్దం మిమ్మల్ని రక్షించలేదని తమన్నా హెచ్చరించింది. మీ హక్కుల కోసం మీరు పోరాడాల్సిన అవసరముందని సూచించింది. మానవుడు లేదా జంతువు ఏదైనా జీవితమే కదా? అన్న తమన్నా.. సృష్టిని హింసించడం సార్వత్రిక చట్టానికి విరుద్ధమని తెలిపింది. మనం నేర్చుకోవాలి.. మానవత్వమున్న మనిషిగా మారాలని కోరింది. కరుణను వ్యక్తపరుస్తూ ప్రేమను పంచాలని కోరింది. ప్రతీ జీవి జీవించడం ముఖ్యమే అంటూ.. ఈ పోరాటంతో ప్రపంచాన్ని మేల్కొలుపుదామని పిలుపునిచ్చింది తమన్నా.

Advertisement

Next Story