- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాలిటిక్స్ లేనిదెక్కడ ? : తమన్నా
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన.. నెపోటిజంపై చర్చకు దారితీసింది. బాలీవుడ్ నుంచి మల్లూవుడ్ వరకు అంతటా ఈ విషయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది దీనిపై తమ గొంతును వినిపించారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నెపోటిజంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
గతంలో.. ఓ లోకోక్తి ఉండేది. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడని, లాయర్ కొడుకు లాయర్ అని. తమ తమ ఫీల్డ్‌ను బట్టి వచ్చే వారసులు కూడా అదే బాటలో పయనించేవారు. ఇప్పుడు తమన్నా కూడా ‘నెపోటిజం’పై అదే విధంగా స్పందించింది. ‘మా కుటుంబంలో అందరూ డాక్టర్లే. ఒకవేళ నేను కూడా అటువైపుగా వెళ్లి ఉంటే.. మా ఫాదర్ లేదా బ్రదర్ నన్ను గైడ్ చేసి ఉండేవారు. ఒకవేళ.. భవిష్యత్తులో నా పిల్లలు సినీ పరిశ్రమలోకి వస్తానంటే నేనూ వాళ్లకు సపోర్ట్‌గా ఉంటాను. అందులో తప్పేమీ లేదు. సినీ పరిశ్రమతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. ఎవరితోనూ పరిచయాలు లేవు. ఈవెన్.. తమిళ, తెలుగు భాషలు కూడా రావు. అయినా.. అవకాశాలొచ్చాయి. నా కష్టాన్ని, ప్రతిభను చూసిన వారు నాకు అవకాశాలు ఇచ్చారు. నెపోటిజం, పాలిటిక్స్ అనేవి ఇక్కడనే కాదు.. ప్రతీ రంగంలోనూ కామన్‌గా ఉంటాయి. కానీ అవే.. ఒకరి ఫెయిల్యూర్, సక్సెస్‌లను నిర్దేశించలేవు’ అని తమన్నా వ్యాఖ్యానించింది.