- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యులే ధైర్యం చెప్పారు : తమన్నా
దిశ, వెబ్‌డెస్క్: కరోనా బారినపడిన మిల్కీబ్యూటీ తమన్నా.. ఇటీవలే వైరస్‌ను జయించిన విషయం తెలిసిందే. ఓ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి సెట్లోనే అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన తమన్నా.. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ముంబయి వెళ్లిపోయింది. కాగా తనకు చికిత్స అందించిన కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులకు, వైద్య సిబ్బందికి తాజాగా కృతజ్ఞతలు తెలియజేసింది.
‘కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపేందుకు మాటలు కూడా సరిపోవు. నేను చాలా బలహీనంగా, అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలా భయపడ్డాను. వారే నాకు ధైర్యాన్ని అందించారు. మీరు నాపై చూపిన ప్రత్యేక శ్రద్ధ, దయాగుణమే నేను త్వరగా కోలుకునేలా చేసింది’ అని తమన్నా ఇన్‌స్టాలో పేర్కొంది. ఈ సందర్భంగా.. తాను కాంటినెంటల్ వైద్యులు, సిబ్బందితో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఇక కరోనా నుంచి కోలుకున్నాక తమన్నా మళ్లీ ఫిట్‌నెస్ మీద శ్రద్ధ పెట్టింది. తాను వర్కవుట్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని’ వివరించింది.