మీకేం పని లేదా?

by Shyam |
మీకేం పని లేదా?
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నాకు కోపమొచ్చింది. తనను ఖాళీగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్న వారిపై ఫైర్ అయిపోతుంది. 365 రోజులు బిజీ షెడ్యూల్‌తో గడుపుతున్న నన్ను… ఖాళీగా ఉన్నారని మీరెలా అంటారని మండిపడుతుంది. నాకు నచ్చిన పాత్రలను సెలక్ట్ చేస్తూ… వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూనే ఉంటే… మీ నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడుతారని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం గోపీ చంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ‘సీటీమార్’ షూటింగ్ దశలో ఉందని… ఆ ప్రాజెక్ట్ గురించే కబడ్డీ కూడా నేర్చుకుంటానని తెలిపింది. తమన్నాకు సినిమాలు లేవు… దర్శకులు, నిర్మాతలు ఆమెను ప్రిఫర్ చేయడం లేదు… ఇక ఆమె పని అయిపోయిందని వార్తలు స్ప్రెడ్ చేయడం ఆపేస్తే మంచిదని క్లాస్ ఇస్తోంది. నన్ను ఖాళీగా లేదు అని కామెంట్ చేస్తున్నవారే.. ఖాళీగా ఉండి ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని అర్ధం చేసుకోవాలని కోరింది.

మెగాస్టార్ చిరంజీవి సరసన చాన్స్ కొట్టేసి ‘సైరా’ తో హిట్ అందుకున్న తమన్నా…. ఈ సినిమాలో చేసిన పాత్రకు ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. కాగా ‘సీటీమార్‌’ తో పాటు మరిన్ని ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టిందట తమ్మూ బేబి.

Tags: Tamannaah Bhatia, Seetimaar, Fire, Gopichand, Chiranjeevi, Saira

Advertisement

Next Story