తాప్సీ 'హసీనా దిల్ రుబా' షురూ..

by Shyam |
తాప్సీ హసీనా దిల్ రుబా షురూ..
X

దిశ, వెబ్ డెస్క్ :
తాప్సీ పన్ను.. సినిమా కమిట్ అయితే ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో చేసిన మూవీస్ ఇందుకు ఎగ్జాంపుల్ కాగా.. అటు కెరియర్‌ను, ఇటు పర్సనల్ లైఫ్‌ను భలే బ్యాలెన్స్ చేస్తోంది. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్న భామ.. సిస్టర్ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌లను కూడా ఎంచక్కా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్‌కు వెళ్లిన తాప్సీ.. స్వర్గంలో విహరించినట్లుగా ఉందంటూ జాయ్ ఫుల్‌గా గడుపుతోంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కూడా ఇస్తున్న తాప్సీ.. మళ్లీ సినిమా షూటింగ్స్‌తో బిజీ బిజీగా గడపనుందట.

కాగా, అక్టోబర్ 15 నుంచి తాప్సీ నటిస్తున్న ‘హసీనా దిల్ రుబా’ షూటింగ్ మొదలు కానుంది. వినిల్ మాథ్యూ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో విక్రాంత్, హర్షవర్ధన్ రానేలతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది భామ. లాక్ డౌన్ తర్వాత విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న తమిళ సినిమా కోసం జైపూర్‌లో చిత్రీకరణలో పాల్గొన్న ఈ సొట్టబుగ్గల సుందరి.. ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. కాగా ఈ సినిమాలో డబుల్ రోల్‌లో కనిపించబోతుందని టాక్. ఇవే కాక ‘శభాష్ మిథు, రష్మి రాకెట్’ సినిమాలు చేస్తోంది తాప్సీ.

Advertisement

Next Story