హీరోలకు తాప్సీ 'థప్పడ్'

by Shyam |
హీరోలకు తాప్సీ థప్పడ్
X

తాప్సీ పన్ను… సౌత్ ఇండస్ట్రీని బేస్ చేసుకుని బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. యూనిక్ యాక్టింగ్‌తో అదరగొడుతున్నఈ భామ… హిందీ చిత్ర సీమలో ఆచి తూచి సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. అయితే బాలీవుడ్ బాటపట్టిన హీరోయిన్లు దక్షిణాది సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడడం కామన్. అదే పని చేసింది తాప్సీ. అప్పట్లో ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురించే నెగెటివ్‌గా మాట్లాడి విమర్శలు ఎదుర్కుంది ఈ భామ.

అయితే ప్రస్తుతం ‘థప్పడ్’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తాప్సీ మరో సారి హీరోలపై నోరు పారేసుకుంది. కొందరు హీరోలు అంతగా ఫేమ్ లేని హీరోయిన్లతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలిపింది. తనతో కూడా సినిమాలు చేసేందుకు అంగీకరించని హీరోలున్నారని… వారు ఇప్పుడు పత్తా లేకుండా పోయారని విమర్శించింది. హీరోలు హీరోయిన్ల ప్రతిభకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని సూచించింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దూసుకుపోతున్న తాప్సీ… ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. అయితే ఏ హీరోల గురించి మాట్లాడిందో స్పష్టంగా చెప్పకపోయినా… ఎవరి సపోర్ట్ లేకుండా కేవలం తన టాలెంట్‌ను నమ్ముకుని బాలీవుడ్‌లో వరుస హిట్‌లు కొడుతున్న తాప్సీపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Tags : Taapsee Pannu, Thappad, Bollywood

Advertisement

Next Story