- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమ్మాయి కోసం తాప్సీ ఇన్వెస్టిగేషన్?
దిశ, సినిమా: బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతున్న ‘తాప్సీ పన్ను’ మరో కొత్త సినిమా ప్రకటించింది. ‘స్కామ్ 1992’ ఫేమ్ ప్రతీక్ గాంధీతో కలిసి ‘వో లడ్కీ హై కహా’ చిత్రంలో లీడ్ రోల్‌లో కనిపించబోతుంది. రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించనున్న సినిమా ద్వారా రైటర్ అర్షద్ సయ్యద్ డైరెక్టర్‌గా మారబోతున్నారు. ప్రతీక్ ఇగోయిస్టిక్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ కామెడీ ఫిల్మ్‌లో తాప్సీ బబ్లీ పోలీస్ ఆఫీసర్‌గా అలరించనుంది. డిఫరెంట్ యాటిట్యూడ్స్‌తో ఉన్న ఈ ఇద్దరు కలిసిచేసే ప్రయాణంలో క్రియేట్ అయ్యే ఫన్ చాలా సరదాగా ఉంటుందన్నారు మేకర్స్. 2021 ఎండింగ్‌లో స్టార్ట్ కానున్న సినిమాను 2022 ఫస్ట్ హాఫ్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
అర్షద్ చెప్పిన చార్మింగ్ అండ్ డిలైట్‌ఫుల్ స్క్రీన్‌ప్లే విన్నాక తప్పకుండా ఈ సినిమాను నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ తెలిపారు. ముఖ్యంగా స్క్రీన్‌పై ఎనర్జీని, బ్యూటిఫుల్‌నెస్‌ను తీసుకొచ్చే తాప్సీ, ప్రతిభావంతుడైన ప్రతీక్‌తో పనిచేసే చాన్స్ రావడం ఆనందంగా ఉందన్నారు. కాగా తాప్సీ ప్రస్తుతం మిథాలీ రాజ్ బయోపిక్ మూవీ ‘శభాష్ మిథు’తో బిజీగా ఉంది. ఇందుకోసం మిథాలీ ఫ్రెండ్, మాజీ ఉమెన్ క్రికెటర్ నూషిన్ ఖదీర్ దగ్గర కోచింగ్ తీసుకుంటుంది.
Hitting the road along with @taapsee in search of a missing ladki! Get ready for a riotous ride!#WohLadkiHaiKahaan? produced by #SiddharthRoyKapur, @roykapurfilms and written & directed by @justarshad . On the floors soon! pic.twitter.com/wJcI9Odag0
— Pratik Gandhi (@pratikg80) February 22, 2021