గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల దీక్ష

by Shyam |
గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల దీక్ష
X

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేతలు వీహెచ్, పొన్నం ప్రభాకర్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో రైతులను మిల్లర్లు నిండా ముంచుతున్నారని ఆరోపించారు. తరుగు పేరిట దోచుకుంటారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags: congress leaders protest, gandhi bhavan, hyd, farmers issue

Advertisement

Next Story