షాకింగ్.. ఒకే వ్యక్తిలో బ్లాక్, వైట్ ఫంగస్ లక్షణాలు

by Shamantha N |
షాకింగ్.. ఒకే వ్యక్తిలో బ్లాక్, వైట్ ఫంగస్ లక్షణాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా పుణ్యమా అని వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ రోగిలో బ్లాక్, వైట్ ఫంగస్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. దీంతో అతను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే, దేశంలో ఇలాంటి తరహా కేసు నమోదు అవడం ఇదే మొదటిసారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వేలల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవుతున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Advertisement

Next Story