- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా.. స్విగ్గీ డెలి‘వర్రీ’!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం ప్రపంచాన్ని భయపెడుతున్నవేళ అన్ని రంగాలు భారీ పతనాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆన్‌లైన్ బిజినెస్‌లు చాలా నష్టపోతున్నాయి. అటు మార్కెట్లు కుదేలవుతుండగా… ఇటు సినిమా ఇండస్ట్రీ భారీ నష్టాలను చవిచూస్తోంది. ఈ సమయంలో భారత్‌లో స్విగ్గీ సంస్థ జాగ్రత్త పడింది. వినియోగదారులకు అందించే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో చెబుతూ కస్టమర్లకు మెయిల్స్ పంపించింది. కరోనా వైరస్ వ్యాప్తికి క్రియాశీలక చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది.
బెంగళూరుకు చెందిన స్విగ్గీ సంస్థ తన డెలివరీ భాగస్వాములకు కూడా కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నట్లు అడ్వైజరీ నోట్‌లో తెలిపింది. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు డెలివరీ భాగస్వాములకు నిరంతర శిక్షణ ఇస్తున్నట్లు చెప్పింది. కస్టమర్లు, ఉద్యోగులు, డెలివరీ భాగస్వాములు, రెస్టారెంట్ భాగస్వాముల భద్రతకు ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తామన్న స్విగ్గీ.. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో గతంలో కంటే ఎక్కువ జాగ్రత్త పడుతున్నామని వెల్లడించింది. కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్లైతే డెలివరీ భాగస్వాములకు ఉచిత వైద్యం కూడా అందిస్తామని పేర్కొంది. ఆ సమయంలో వారికి ఆర్థికంగా మద్దతు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
తమ రెస్టారెంట్ భాగస్వాములతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నామని, ఆహార పదార్థాలను ప్యాక్ చేసేటప్పుడు ఉత్తమమైన పరిశుభ్రత పద్ధతులను పాటిస్తున్నామని వినియోగదారులు ఎలాంటి సందేహం పెట్టుకోవద్దని సూచించింది. అనారోగ్యంగా ఉన్నట్లైతే తమ డోర్ దగ్గర ఆర్డర్ పెట్టేసి వెళ్లాలని డెలివరీ బాయ్స్‌కు చెప్పాలని తెలిపింది. ఈ మెయిల్స్‌తో, అడ్వెజరీ నోట్స్‌తో కస్టమర్లు హ్యాపీగా ఉన్నా… ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ట్రై చేసినా.. కొంచెం ప్రాబ్లమే. ఎందుకంటే మార్చి 3న ఈ అడ్వైజరీ నోట్‌ను రిలీజ్ చేసిన స్విగ్గీ సంస్థ ఇప్పటివరకు ఆ దిశగా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉండేందుకు కంపెనీ ఎలాంటి సహాయం, సూచనలు అందించడం లేదని డెలివరీ భాగస్వాములు చెబుతున్నారు.
మాస్క్, శానిటైజర్ లాంటివి కూడా ఇవ్వలేదని తెలిపారు. దీంతో ఫుడ్ ఆర్డర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే నిర్ణయించుకోవాలని చెబుతున్నారు నిపుణులు. వీలైతే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే స్విగ్గీ ప్రత్యర్థి జొమాటో ఇప్పటి వరకు కనీసం కస్టమర్ అడ్వైజరీ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. కానీ, సోషల్ మీడియా చానల్స్‌లో మాత్రం భోజనం చేసే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలంటూ ఓ ప్రకటన జారీ చేసింది.
Tags: Swiggy, Zomato, Advisery Note, Emails, Customer, Delivery Partners