పార్కిన్సన్స్ బాధితుల్లో వణుకుడు తగ్గించే సూట్

by Shyam |
పార్కిన్సన్స్ బాధితుల్లో వణుకుడు తగ్గించే సూట్
X

దిశ, ఫీచర్స్ : పార్కిన్సన్స్ నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు దెబ్బతిని, క్షీణించటం కారణంగా ఈ వ్యాధి ఏర్పడుతుండగా.. బాధితుల్లో శరీర భాగాలు ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల వణుకుతుంటాయి. ఈ లక్షణాలను నియంత్రించడానికి మందులు కొంతవరకు దోహదపడినా, డయాగ్నోసిస్‌కు సంవత్సరాల సమయం పడుతుంది. వాస్తవానికి దీన్ని పూర్తిగా క్యూర్ చేయలేమనే చెప్పొచ్చు. అయితే స్వీడిష్ డిజైనర్ వీరికోసం ప్రత్యేకంగా ఓ సూట్ రూపొందించాడు. ఈ కొత్త సూట్ పార్కిన్సన్, స్ట్రోక్ సెలబరల్ పాల్సీ రోగుల్లో చైతన్యాన్ని మెరుగుపరిచేందుకు సాయపడుతుంది.

పార్కిన్సన్స్ బాధితులు తరచుగా వణుకుతుండటంతో ఆ బాధను తీర్చాలనుకున్న స్వీడిష్ ఇంజనీర్.. ‘మొల్లి సూట్’ను రూపొందించాడు. సింగిల్-పీస్ సూట్ 58 ఎంబెడెడ్ ఎలక్ట్రోడ్లతో తయారుచేయగా, ఇవి ఎలక్ట్రానిక్ స్టిమ్యులేషన్‌ను కలిగించి, అటువంటి ప్రకంపనలను గణనీయంగా తగ్గించడంలో సాయపడతాయి. తక్కువ-పౌన:‌పున్యం గల ఎలక్ట్రోస్టిమ్యులేషన్.. రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు మజిల్ పెయిర్స్ మధ్య గతంలో నిరోధించిన సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. ఉదాహరణకు.. కండరపుష్టి ఉద్రిక్తతతో ఉంటే, సూట్ ట్రైసెప్‌ను ప్రేరేపిస్తుంది, దీనివల్ల కండరపుష్టి విశ్రాంతి పొందుతుంది. ఈ సూట్‌లో కదలికలను, నరాలను ప్రేరేపించడానికి స్మాల్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఉపయోగపడతాయి. రోజు మొత్తంలో యూజర్ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఈ సూట్‌ను తయారుచేయడం విశేషం.

ఇందులో ఒక జత ప్యాంట్స్, జాకెట్, డిటాచబుల్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. విశ్వవిద్యాలయాలతో పాటు స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్, డెన్మార్క్‌లోని హెవిడోవ్రే హాస్పిటల్, ఫ్రాన్స్‌లోని హాస్పిటల్ హెన్రీ మోండోర్, లెబనాన్‌లోని ఎల్‌యూ వంటి ప్రఖ్యాత వైద్యుల నేతృత్వంలో అనేక క్లినికల్ అధ్యయనాల్లో ఈ సూట్‌ను పరీక్షించారు. ఈ రూపకల్పనకు జర్మన్ ప్రోస్థటిక్స్ సంస్థ ‘ఒట్టో బాక్’ మద్దతు ఉంది. హార్వర్డ్ పరిశోధకులు 2019‌లో హిప్-హగ్గింగ్ సూట్‌ను అభివృద్ధి చేయగా, అది ఒక వ్యక్తి కదలికలకు అనుగుణంగా నడవడానికి సాయపడింది.

Advertisement

Next Story