- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొన్ని కులాల వారే పరిపాలన నడిపిస్తున్నారు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొన్ని కులాలకు చెందిన వారే పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నారాయణ గురు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏకరూప సిద్ధాంతం దేశంలో అమలు చేయాల్సిన అవసరం ఉందని, కుల రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వందేళ్ల క్రితం ఏర్పడ్డ కుల రక్కసి పునాదులే ఇప్పటికీ పరిపాలనా కొనసాగిస్తున్నాయన్నారు.
దేశంలో బడి, గుడి కొంతమందికే పరిమితమై మళ్లీ మొదటికి రావడం వల్లే నారాయణ గురును గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఏకరూప సిద్ధాంతాన్ని విస్తరింప చేయాలని అన్నారు. అధికారం కొంతమందికే పరిమితమైందని, నారాయణ గురు స్ఫూర్తితో అన్నివర్గాల ప్రజలు ఐక్యం కావాలని పేర్కొన్నారు.