నందిగ్రామ్‌లో వెనుకబడిన మమతా బెనర్జీ..

by Shamantha N |
నందిగ్రామ్‌లో వెనుకబడిన మమతా బెనర్జీ..
X

దిశ, వెబ్‌డెస్క్ : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ఫలితాలు బీజేపీ, టీఎంసీ మధ్య నెక్ టు నెక్ వస్తున్నాయి. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. క్షణం క్షణం ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఆది నుంచి టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ అభ్యర్థులు కూడా అదే రేంజ్‌లో దూసుకుపోతున్నారు. నువ్వా నేనా అన్నట్లు ఇరుపార్టీల మధ్య పోరు సాగుతోంది.

ఇకపోతే నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం మమతా బెనర్జీ పై బీజేపీ క్యాండిడేట్ సువేంధు అధికారి 1500 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్ లోనూ సువేంధు మమతను బీట్ చేశారు. కౌంటింగ్ మొదలైన తొలి అరగంట పాటు వెనుకబడిన మమతా తిరిగిపుంజుకున్నారు. ప్రస్తుతం మళ్లీ వెనుకంజలో కొనసాగుతున్నారు. హోరాహోరిగా సాగుతున్న ఈ పోరులో ఎవరు గెలుస్తారో తెలియాలంటే చివరి రౌండ్ వరకు వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story