బెంగాల్ ప్రతిపక్ష నేతగా సువేందు అధికారి

by Shamantha N |
బెంగాల్ ప్రతిపక్ష నేతగా సువేందు అధికారి
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేందరూ కలిసి ఆయను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష నాయకుడి పదవి కోసం సువేందు అధికారితో పాటు మనోజ్ తిగ్గా, ముకుల్ రాయ్‌లు కూడా పోటీ పడ్డారు. కానీ నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి వైపే బీజేపీ అధినాయకత్వం మొగ్గు చూపింది.

ప్రతిపక్ష నేతగా ఎన్నికైన సువేందు అధికారి మాట్లాడుతూ.. మమతా ప్రభుత్వానికి అన్ని విధాలా తాను సహకరిస్తానన్నారు. కానీ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు తనను ఎంతో ఆవేదనకు గురిచేశాయని, ఈ విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రజా ఉపయోగ నిర్ణయాలను సమర్థిస్తాన్నారు.

Advertisement

Next Story