సుశాంత్ కేసులో సుప్రీం కీలక తీర్పు!

by Anukaran |   ( Updated:2020-08-19 01:58:05.0  )
సుశాంత్ కేసులో సుప్రీం కీలక తీర్పు!
X

అభిమానుల పంతం నెగ్గింది.. కుటుంబ సభ్యుల పోరాటం ఫలించింది.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విషయంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ చేసిన ఉద్యమ తీవ్రతను గుర్తించిన సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతూ.. సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాదు, ఇప్పటివరకు ముంబై పోలీసుల విచారణలో సేకరించిన అన్ని ఆధారాలను సీబీఐకి అప్పగించాలని కోరింది. సుశాంత్ మరణం వెనుక రహస్యాలను తెలుసుకునేందుకు అతడి తండ్రి పాట్నాలో కేసు పెట్టడం సరైన నిర్ణయంగా భావించిన కోర్టు.. సుశాంత్ తండ్రి ఎఫ్ఐఆర్‌ను సీబీఐకి సూచించే హక్కు బీహార్ ప్రభుత్వానికి ఉందని చెప్పింది. సుశాంత్ తండ్రి ఎఫ్ఐఆర్‌తో పాటు సుశాంత్ విషయంలో ఎవరు? ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు చేసినా, సీబీఐ సమర్థవంతంగా దర్యాప్తు చేస్తుందని తెలిపింది. రాజ్‌పుత్ మరణ రహస్యాన్ని దర్యాప్తు చేసే అధికారం కేవలం సీబీఐకి మాత్రమే ఉందని.. ఈ కేసు విషయంలో ఈ రాష్ట్ర పోలీసులు కూడా జోక్యం చేసుకోరని భరోసా ఇచ్చింది.

దీంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. తప్పకుండా సుశాంత్ కేసు విషయంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story