కోరుట్లలో 50 వైద్య బృందాలతో సర్వే

by Sridhar Babu |
కోరుట్లలో 50 వైద్య బృందాలతో సర్వే
X

దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా వ్యాధికి గురైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ రవి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో కరోనా బాధితుడు నివాసం ఉంటున్న ప్రాంతంలో సర్వే చేసేందుకు 50 మెడికల్ టీమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. 9 మంది మెడికల్ ఆఫీసర్లను నియమించడంతో పాటు ఓ ప్రోగ్రాం ఆఫీసర్‌ను కూడా ఇన్‌చార్జీగా నియమించినట్టు ఆయన తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్‌కు తరలించడం జరుగుతుందని చెప్పారు. ఆ తరువాత మరో పాజిటివ్ కేసు నమోదు అయిన గ్రామాన్ని కూడా కలెక్టర్ రవి సందర్శించారు. గ్రామంలో సర్వే కోసం 6 టీములను ఏర్పాటు చేశామని, ఇందులో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ ఉంటారని స్పష్టం చేశారు. ప్రజలు సహకరించి ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వచ్చినట్టయితే క్వారంటైన్‎కు తరలిస్తామని కలెక్టర్ రవి హెచ్చరించారు.

tag: Corona Affected Areas, Survey, 50 Medical Teams, Korutla

Advertisement

Next Story