కొత్తి మీరతో బోలెడు ప్రయోజనాలు

by sudharani |   ( Updated:2021-06-23 08:15:47.0  )
కొత్తి మీరతో బోలెడు ప్రయోజనాలు
X

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది కొత్తి మీరను వంటల్లో వాడుతూ ఉంటారు. కూరల్లో చక్కని సువాసన, మంచి రుచిని ఇవ్వడం కొత్తి మీర ప్రత్యేకత. అయితే, కొత్తి మీర రుచిలోనే కాదు, ఆరోగ్య సమస్యలను తగ్గించడంతో కూడా అద్భుతంగా సహాయపడుతుందనీ, దీనిని తరచూ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అంటున్నారు నిపుణులు.

కొత్తి మీరలో పీచు శాతం ఎక్కువ. ఇందులో మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్‌లు తగిన మోతాదులో లభిస్తాయి. దీనిలో విటమిన్ సి, కె లతో పాటు ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన శరీరంలో హాని చేసే కొవ్వు తగ్గుతుంది. అంతేగాకుండా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

మధుమేహంతో బాధపడేవారికి ఇది చక్కని ఔషధంలా పని చేస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను సమన్వయపరుస్తుంది. దీనిలో ఉండే విటమిన్ కె వయసు మళ్లిన తర్వాత వచ్చే మతిమరుపు వ్యాధి నియంత్రణలో కీలకంగా పని చేస్తుంది. అంతేగాకుండా కొవ్వును కరిగించే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో అధికంగా లభిస్తాయి.

కొత్తిమీరలోని యాంటీసెప్టిక్ లక్షణాలు నోటిపూతను తగ్గిస్తాయి. అంతేగాకుండా మహిళల్లో వచ్చే నెలసరి ఇబ్బందులను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. కొత్తి మీరలోని యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీర కణాలను కాపాడతాయి.

కొత్తి మీర వలన ఇన్ఫెక్షన్లొచ్చే అవకాశాలుండవంట. సూక్ష్మ క్రిములతో పోరాడే లక్షణాలు కొత్తి మీరకు ఉండటంతో మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇక ఆహారం కల్తీ అయినప్పుడు కొత్తి మీర తినాలని సూచిస్తున్నారు నిపుణులు. అందులోని డోడెసెనాల్ అనే పదార్థం, బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే సాల్మొనెల్లా బ్యాక్టీరియాను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

పుదీనాతో బెనిఫిట్స్..

Advertisement

Next Story