సర్జికల్ స్పిరిట్ తాగి ఐదుగురు మృతి

by srinivas |   ( Updated:2020-06-01 01:14:10.0  )
సర్జికల్ స్పిరిట్ తాగి ఐదుగురు మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్‌లో మత్తు కోసం సర్జికల్ స్పిరిట్ తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదం నింపింది. విశాఖ జిల్లాలోని కశింకోటకు చెందిన కునిశెట్టి ఆనంద్ (55), వడిశల నూకరాజు (61), పెతకంశెట్టి అప్పారావు (50), మాణిక్యం, దొరబాబులు శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఆదివారం ఉదయం వీరంతా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరుకున్నారు.

దీంతో వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించేసరికి ఆనంద్, నూకరాజు మృతి చెందగా, మిగిలిన వారిని అక్కడి నుంచి కేజీహెచ్‌కి తరలించారు. అప్పారావు చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు.. మాణిక్యం, దొరబాబులు ఈ ఉదయం కేజీహెచ్‌లో మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వీరిలో ఒకరు ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్నారు. అక్కడి నుంచి వస్తూవస్తూ రహస్యంగా సర్జికల్ స్పిరిట్ తీసుకొచ్చాడు. మత్తు ఎక్కువగా ఇస్తుందన్న ఉద్దేశంతో పార్టీలో ఆ స్పిరిట్‌ను తలా కొంత తాగారు.

Advertisement

Next Story