‘జై శ్రీరాం’ స్లోగన్‌పై పిటిషన్.. సుప్రీం డిస్మిస్

by Shamantha N |   ( Updated:2021-03-09 02:28:44.0  )
supreme court
X

న్యూఢిల్లీ : ఐదు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారం జోరందుకున్నది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్టు క్యాంపెయిన్ సాగుతున్నది. ఇందులో స్థానికత, బయటివారు, మతాలు, దేవుళ్లపేర్లూ ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కొందరు నేతలు ‘జై శ్రీరాం’ నినాదాలను రాజకీయలబ్ది కోసం వినియోగిస్తున్నారని, ఈ నినాదంతో సమాజంలో చీలకలు వచ్చే ముప్పు ఉన్నదని ఆ పిటిషన్ ఆరోపించింది. రాజకీయాల కోసం ఈ నినాదాన్ని వాడకుండా ఆదేశాలివ్వాలని కోరింది. అంతేకాదు, పశ్చిమ బెంగాల్‌ పోల్ క్యాంపెయిన్‌లో నేతలు ‘జై శ్రీరాం’ అని నినదిస్తే వారిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేసింది. దీనికి సీజేఐ ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని ధర్మాసనం కల్‌కత్తా హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌ను కోరింది. ఒక పార్టీ మతపరమైన నినాదాలు చేస్తున్నదని, తాను ఎందుకు హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్ అడిగారు. తాము పిటిషనర్‌తో ఏకీభవిస్తలేమంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. బెంగాల్‌లో ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించడంపైనా ఇదే పిటిషన్ ప్రశ్నించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed