ట్రాక్టర్ ర్యాలీ హింసపై సుప్రీంలో విచారణ..

by Sumithra |
supreme court
X

దిశ, వెబ్‌డెస్క్ : గణతంత్ర వేడుకల సందర్భంగా కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే.ఈ ఘటనల్లో ఓ యువరైతు ట్రాక్టర్ తిరగబడి మరణించగా.. భారీ కేడ్లను తొలగించేందుకు రైతులు ప్రయత్నించే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు కర్రలు, కత్తులు, రాడ్లతో పోలీసులపై దాడికి యత్నించగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈ ఘటనలో 200 మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో జరిగిన హింసపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.జస్టిస్ ఎస్ ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మానం విచారణ అనంతరం తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story