- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సూపర్ స్టార్ మహేష్ కోటి విరాళం
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు.. నిజంగా ప్రిన్స్ అనిపించుకున్నాడు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వాలు చేపట్టిన కరోనా నిర్మూలనా చర్యలను అభినందిస్తూ తన వంతు సాయాన్ని ప్రకటించాడు. కరోనా నివారణకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న గొప్ప ప్రయత్నాన్ని అభినందించిన మహేష్… కరోనా మహమ్మారిపై పోరాటాన్ని సపోర్ట్ చేస్తే… తను కూడా భాగస్వామి అయ్యేందుకు నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఇందులో భాగంగానే రూ. కోటి విరాళాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి అందిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతేకాదు మీకు తోచిన సాయం అందించేందుకు ముందుకు రావాలని ప్రతీ ఒక్కరిని కోరుతున్నానని… ఈ సమయంలో మీ సహాయం చాలా విలువైనదన్నారు.
ప్రతీ ఒక్కరూ కరోనా నిర్మూలను ప్రభుత్వం అందిస్తున్న సూచనలు పాటించాలని… లాక్ డౌన్‌కు సపోర్ట్ చేయాలని కోరారు. ఒకరికొకరు సపోర్ట్‌గా నిలబడుతూనే… మనల్ని మనం రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మానవత్వం పెరుగుతుందని… తప్పకుండా కరోనా మహమ్మారిపై విజయం సాధిస్తామన్నారు. అప్పటి వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని కోరారు మహేష్ బాబు.
Tags : Mahesh Babu, Contribution, CoronaVirus, Covid 19