బ్రేకింగ్: ఐపీఎల్‌లో బోణీ కొట్టిన హైదరాబాద్

by Anukaran |
బ్రేకింగ్: ఐపీఎల్‌లో బోణీ కొట్టిన హైదరాబాద్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2021‌ సీజన్‌లో వరుసగా మూడు పరాజయాల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నాలుగో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు‌ దిగిన పంజాబ్‌ను SRH బౌలర్లు 120 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో 20 ఓవర్లలో 121 పరుగులు చేయాల్సి ఉండగా.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (37) రన్స్‌తో శుభారంభం ఇచ్చాడు. మరో బ్యాట్స్‌మాన్ బెయిర్ స్టో (63 నాటౌట్) మ్యాచ్‌ చివరి దాకా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి తోడు కేన్ విలియమ్సన్(16) పరుగులతో తన వంతు కృషి చేశాడు. దీంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపొందింది.

Advertisement

Next Story