గుడ్ జాబ్ బేబీ : సన్నీ లియోన్

by Shyam |
గుడ్ జాబ్ బేబీ : సన్నీ లియోన్
X

తారలంతా ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీబిజీ‌గానే ఉంటారు. ఇక కాస్త గ్యాప్ దొరికితే చాలు.. సెలబ్రిటీలంతా వెకేషన్‌కు వెళ్తుంటారు. పెళ్లయిన వాళ్లు ఫ్యామిలీతో ప్లాన్ చేస్తే.. బ్యాచిలర్స్ తమ ఫ్రెండ్స్‌తో చిల్ అవుట్ చేస్తుంటారు. ముఖ్యంగా సమ్మర్‌లో సెలబ్రిటీలంతా కూల్‌ ప్రదేశాలకు వెళ్లడం కామనే. కానీ ఈ సారి కరోనా అందరినీ ఇంట్లోనే పెట్టి లాక్ చేసేసింది. లాక్‌డౌన్ సడలింపులతో.. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ మెల్లగా పట్టాలెక్కుతుండగా.. ఈ టైమ్ గ్యాప్‌లోనే ఓ స్మాల్ టూర్ ప్లాన్ చేసేస్తున్నారు సెలబ్రెటీలు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ స‌న్నీ లియోన్ త‌న పిల్ల‌లు, ఫ్యామిలీతో క‌లిసి లాక్‌డౌన్ తర్వాత తొలి ట్రిప్‌కు వెళ్లింది.

లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న భ‌ర్త డానియ‌ల్ వెబ‌ర్‌, పిల్ల‌లు నోహ‌, అశ‌ర్, నిషాతో లాస్ ఏంజెల్స్‌లో హ్యాపీగా గడిపిన సన్నీ లియోన్.. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని బాల్బోవా లేక్‌కు వెళ్ళారు. ‘కొత్త ప్రదేశాలకు వెళ్లడం ఎప్పుడూ సంతోషగానే ఉంటుంది. జనాలకు దూరంగా.. పిల్లలు, మేము కలిసి బాల్బోలా లేక్‌కు వచ్చాం. ఈ ప్లేస్‌ను ఫైండ్ అవుట్ చేసి, వెకేషన్ కోసం ఇక్కడకు తీసుకొచ్చావు.. గుడ్ జాబ్ బేబీ’ అంటూ బాల్బోవా లేక్ అందాలతో పాటు సన్నీలియోన్ మాస్క్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. కాగా సన్నీ సోయగాలకు, బాల్బోవా లేక్ బ్యూటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Advertisement

Next Story