ఎవరికీ భారం కాకూడదని… పురుగులమందు తాగిర్రు

by Sridhar Babu |   ( Updated:2020-08-31 08:21:28.0  )
ఎవరికీ భారం కాకూడదని… పురుగులమందు తాగిర్రు
X

దిశ, మధిర: ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఎవరికీ భారం కాకూడదని భావించిన వృద్ధ దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం జరుగగా, సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళితే…

పొద్దుటూరు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు నాగయ్య(75), నారాయణమ్మ(70) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. అంతేగాకుండా పిల్లలందరూ వారికి దూరంగా వెళ్లడంతో ఆర్థికంగా కుంగిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనారోగ్యంతో ఎవరికీ భారం కాకూడదని భావించి, ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ కలిసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story