మావోయిస్టుల బంద్ నేపథ్యంలో వాహనాల ఆకస్మిక తనిఖీలు

by Shyam |
మావోయిస్టుల బంద్ నేపథ్యంలో వాహనాల ఆకస్మిక తనిఖీలు
X

దిశ, మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాలో సీపీ వి.సత్యనారాయణ ఆదేశాల మేరకు దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మ్యాధరిపేట్, జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమాదాబాద్ వద్ద ఏసీపీ అఖిల్ మహాజన్, లక్షేట్టి పేట్ సీఐ నారాయణ నాయక్, ఎస్ఐలు శ్రీకాంత్, ఆది మధుసూదన్ రావు సిబ్బందితో కలిసి ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు. దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో రాకపోకలు సాగిస్తున్న వాహనలను నిలిపి, అనుమానితులను ప్రశ్నించారు. వాహనాలను పోలీసు అధికారుల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు.

Advertisement

Next Story